Kakateeya Kamma Sangham Meet at Rayagada - Orissa



కాకతీయ కమ్మ సంఘం రాయగడ వారి ఆత్మీయ సమావేశం 17 సెప్టెంబర్ 2022.

ఈ సమావేశంలో సుమారు 650 మంది సభ్యులు పాల్గొన్నారు, వీరిలో మహిళలు సగం మంది పైగా హాజరయ్యారు.

రాయగడ, జైపూర్ ప్రాంతాల్లో సుమారుగా 1000 మంది కమ్మవారు (300 కుటుంబాలు) ఉన్నాయి. గతంలో సుమారుగా 1500 వరకు ఉండేవారట, ప్రస్తుతం జైపూర్ సుగర్స్, JK paper మిల్ మూత పడటం వలన, పిల్లలు ఉద్యోగ రీత్యా వేరే ప్రాంతాల్లో స్థిరపడటం వలన గత కొన్ని సంవత్సరాలుగా చాలా మంది ఆంధ్ర, హైదరాబాద్ ప్రాంతాలకు తరలివెళ్లారు. ప్రస్తుతం రాయగడ లో ఉన్న కమ్మవారు ఎక్కువ మంది రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, హోటళ్ళు మరియు ఇతర వ్యాపార రంగాల్లో ఉన్నారు, కొంతమంది వ్యవసాయం చేస్తున్నారు, కొద్ది మంది గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్నారు.

1962 వ సంవత్సరంలో జైపూర్ నుండి కమ్మవారైన నూతక్కి రామశేషయ్య గారు స్వతంత్ర పార్టీ తరపున MLA గా ఎన్నికయ్యి, ఒరిస్సా రాష్ట్ర ఆరోగ్య మంత్రిగా పనిచేశారు.

తరువాత కమ్మవారి ఆడపడుచు శ్రీమతి N రమా గౌరి 2003 - 2008 రాయగడ మునిసిపల్ చైర్ పర్సన్ గా చేశారు. ప్రస్తుతం రాయగడ కు చెందిన నెక్కంటి భాస్కర రావు గారు రాయగడ జిల్లా బిజూ జనతాదళ్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన ఆగస్ట్ 2016 నుండి ఆగస్ట్  2022 వరకు బిజూ జనతాదళ్ పార్టీ రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు.

సంఖ్యా పరంగా ఇక్కడ కమ్మవారి సంఖ్య మిగతా ఆంధ్ర ప్రాంతం కులాల వారితో పోలిస్తే తక్కువగా ఉన్నా, అన్ని రంగాల్లోనూ మంచి స్థితిలో ఉన్నారు

Comments